Image Source: pexels

ప్రతిరోజూ ఆహరంలో మనకు తెలియకుండానే ఎక్కువగా షుగర్ తీసుకుంటాం. తగ్గించే చిట్కాలు చూద్దాం.

సాస్, మసాలాలు, స్నాక్స్ కొనుగోలు చేసే ముందు లేబుల్స్ ను చెక్ చేయాలి. దానిపై ఉన్న షుగర్ క్యాంటింటి తెలుసుకోవాలి.

అధిక ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, డెక్ట్రోస్, సుక్రోస్, మాల్టోస్ వంటి పదార్ధాలు చక్కెరను సూచిస్తాయి.

సోడా, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ , కాఫీ లేదా టీ చక్కెర పానీయాలను తగ్గించండి.

పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, లీన్ ప్రొటీన్స్, ఆరోగ్య కరమైన ఫుడ్స్ తీసుకోండి. ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది.

చక్కెరతో తయారు చేసిన చిరుతిళ్లను మానుకోండి. వాటిని తాజాపండ్లు, పచ్చికూరగాయలు, నట్స్, పెరుగుతో భర్తీ చేయండి.

డెజర్స్ట్, స్వీట్లు ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని తక్కువగా తినండి.

ప్రాసెస్ట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తగ్గించండి. ఇందులో అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది.

మీరు తీసుకునే ఆహారంలో షుగర్ తక్కువగా వాడండి. కాలక్రమేణ మీ టేస్ట్ బడ్స్ అందుకు అలవాటు పడుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.