వచ్చేది వేసవి కాలం. కొందరికి చెమట విపరీతంగా వస్తుంది. దీంతో శరీరం దుర్వాసన వస్తుంది. చెమట, దుర్వాసనతో పోరాడే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ - C అధికంగా ఉంటుంది. ఇవి శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపేసి శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని శుభ్రపరిచి దుర్వాసనను తగ్గిస్తుంది. మంచి బ్యాక్టీరియాతో నిండిన పెరుగు జీర్ణాశయంలో బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుంది. దుర్వాసను తగ్గిస్తుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు. పెక్టిన్ అనే ఫైబర్ శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు తొలగిస్తుంది. దాల్చినచెక్క తింటే శరీర దుర్వాసన తగ్గుతుంది. నోటిలోని, జీర్ణక్రియలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు శరీర దుర్వాసనను తగ్గిస్తాయి. సోంపు మౌత్ ఫ్రెషనర్ గా మీ శ్వాసను తాజాగా ఉంచుతుంది. శరీర దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.