డ్రైఫ్రూట్స్ తో బరువు పెరుగుతారని భయపడతారు. కానీ కొన్ని డ్రైఫ్రూట్స్ తో బరువు తగ్గొచ్చట.

బాదాం శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

వీటిలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కార్బోహైడ్రేట్ల క్రేవింగ్ తగ్గి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువ. కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

ఎండు ద్రాక్షల్లో అయోడిన్, ఫైబర్ ఎక్కువ, ఉప్పు తక్కువ. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది.

గోజి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలతో ఉంటాయి. ఇవి జీవక్రియలను మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది.

ఎండు అంజీరాల్లో ఫిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల ఆకలి తగ్గిస్తుంది.

డైట్ లో చేసుకునే చిన్న చిన్న మార్పులు బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels