డైటింగ్ చేసేవాళ్లు ఎక్కువగా తినకూడదు. కానీ, వాళ్లకు పోషకాలు అందుతూ, తొందరగా ఆకలి అవ్వకూడదు. అలా ఆకలి అవ్వకుండా, ఎక్కువసేపు పొట్ట ఫుల్ గా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. ఆకలి అవ్వకుండా ఉండాలంటే.. పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించాలంటే ఈ పదార్థాలు తింటే మంచిది. డైటింగ్ చేసేవాళ్లకు, బరువు తగ్గాలి అనుకునేవాళ్లకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓట్స్‌లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల అవి నిదానంగా జీర్ణమవుతాయి. దీంతో ఆకలేయదు. చిలగడదుంపలో కూడా ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఆకలి అనిపించదు. బీన్స్‌లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల ఎనర్జీ నిదానంగా విడుదలై తొందరగా ఆకలి అవ్వదు. అవకాడోలో ఉండే.. ఫ్యాట్స్, మోనోఅన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. గింజలు, విత్తనాల్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్, ప్రొటీన్స్ ఫైబర్ వల్ల ఆకలేయదు. ఒక మీల్‌కు మరో మీల్‌కు మధ్య వీటిని తినాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.