ఈరోజుల్లో డయాబెటిస్ సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది.

రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఉండేందుకు తీపి పదార్థాలకు మధుమేహులు దూరంగా ఉండక తప్పదు.

అయితే కొన్ని రకాల మిఠాయిలు మధుమేహులు కూడా తినొచ్చట అవేమిటో తెలుసుకుందాం.

ప్రొటీన్, ప్రొబయాటిక్స్ కలిగిన గ్రీక్ యోగర్ట్ మధుమేహులకు మంచి స్నాక్ గా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉండి ఆకలి తగ్గిస్తుంది.

ఒక మోతాదు పరిమాణంలో ఉన్న ఆపిల్ నుంచి 28 గ్రా. కార్బోహైడ్రేట్, 5 గ్రా. ఫైబర్ అందుతుంది.

కేవలం 13గ్రా. కార్బోహైడ్రేట్ 28 గ్రాముల డార్క్ చాక్లెట్ నుంచి లభిస్తుంది. కనుక డార్క్ చాక్లెట్ తినొచ్చు.

పియర్స్ లో ఫైబర్ ఎక్కువ. కనుక ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను బాగా అదుపు చేస్తుంది.

చియాసీడ్స్ తో చేసిన పుడ్డింగ్ తినొచ్చు. ఇందులో ఫైబర్, ప్రొటీన్, ఒమెగా 3 ఉంటాయి.

బనాన ఐస్ క్రీమ్ కూడా చాలా సింపుల్ పదార్థాలతో తయారవుతుంది. దీనితో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

బాదాములు, జీడిపప్పులు, గుమ్మడి గింజలతో ఇంట్లో తయారు చేసుకున్న ట్రయల్ మిక్స్ కూడా మధుమేహులకు మంచి స్నాక్ గా పనిచేస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels