విటమిన్ డి లోపాన్ని తెలిపే సంకేతాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

అలసట, నీరసం

విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల అలసట, నీరసంగా ఉంటుంది. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా అలసిపోతారు.

Image Source: Canva

అనారోగ్యం

తరచుగా అనారోగ్యం పాలవుతుంటే.. విటమిన్ డి స్థాయిలు తక్కువై ఉండొచ్చు. దానివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి అనారోగ్యానికి గురికావొచ్చు.

Image Source: Canva

కండరాల నొప్పి, బలహీనత

విటమిన్ డి లోపం కండరాల బలహీనంగా మారుతాయి. తరచూ నొప్పి, పడిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

Image Source: Canva

నడుము నొప్పి

దీర్ఘకాలిక నడుము నొప్పి విటమిన్ డి లోపం కారణంగా కండరాల బలహీనతతో ముడిపడి ఉండవచ్చు.

Image Source: Canva

జుట్టు రాలడం

విటమిన్ డి లోపం జుట్టు పెరుగుదల చక్రాలను దెబ్బతీస్తుంది. దీని వలన జుట్టు పలుచబడటం లేదా జుట్టు రాలడం జరుగుతుంది.

Image Source: Canva

బరువు పెరగడం

విటమిన్ డి తక్కువగా ఉన్న వ్యక్తులు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ఊబకాయం సమస్య రావొచ్చు.

Image Source: Canva

ఎగ్జిమా

విటమిన్ డి లోపం వల్ల ఎగ్జిమా వస్తుంది. చర్మపు మంట ఏర్పడవచ్చు. లేదా తీవ్రతరం కావచ్చు.

Image Source: Canva

చిగుళ్ల వ్యాధి

విటమిన్ డి చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిగుళ్ళ లోపం, వాపు లేదా పీరియాడోంటిటిస్కు కారణం కావచ్చు.

Image Source: Canva

UTI సమస్యలు

మూత్ర మార్గాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. తక్కువ విటమిన్ డి స్థాయిలు రోగనిరోధక శక్తిని డిస్టర్బ్ చేయడం వల్ల జరుగుతాయి.

Image Source: Canva