వర్షాకాలంలో ధరించగలిగే డ్రెస్​లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/mahnoorafaz

కాటన్

కాటన్ దుస్తులు మృదువుగా ఉంటూ తేమను పీల్చుకునే గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా ఇవి మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచుతాయి. అనుకోకుండా వర్షంలో చిక్కుకున్నా.. టైట్​గా అతుక్కోని దుస్తులు తీసుకుంటే మంచిది.

Image Source: Pinterest/AlibabaB2B2021

ఖాదీ

ఖాదీ చేతితో నేసినది. గాలి ఆడుతుంది. తేమను సులభంగా గ్రహిస్తుంది. ఇది సహజమైన ఆకృతిని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇవి బెస్ట్.

Image Source: Pinterest/etsy

చందేరి:

మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన చందేరి పట్టు, నూలును కలిపి దీనిని తయారు చేస్తారు. ఈకలా తేలికగా, సన్నగా ఉంటుంది. వర్షాకాలానికి ఇవి అనువైనవి.

Image Source: Pinterest/ffabfabriconline

కోటా డోరియా

కోటా డోరియా అనేది రాజస్థానీ ఫ్యాబ్రిక్. ఇది దాని చెకర్డ్ నేత, సన్నని అనుభూతికి ప్రసిద్ధి చెందింది. ఈ ఫ్యాబ్రిక్ త్వరగా ఆరిపోతుంది. స్కిన్​కి అంటుకోదు.

Image Source: Pinterest/fabricdekho

ముల్ కాటన్

బెంగాల్ నుంచి వచ్చే ముల్ముల్ లేదా ముల్ కాటన్ వెన్నలా మృదువుగా ఉంటుంది. చర్మానికి చాలా సున్నితంగా ఉంటుంది. వర్షాకాలంలో మంచిది.

Image Source: Pinterest/kankan_handloom

మహేశ్వరి

మధ్యప్రదేశ్​లోని మహేశ్వర్ నుంచి వచ్చిన ఈ కాటన్-సిల్క్ మిశ్రమం తేలికగా ఉంటుంది. వర్షాకాలంలో ఇది కంఫర్ట్​గా ఉండడంతో పాటు బెస్ట్ లుక్ ఇస్తుంది.

Image Source: Pinterest/mhshandloom

బెంగాల్ కాటన్

పశ్చిమ బెంగాల్​లో నేసిన ఇవి తేలికపాటి కాటన్. బెంగాల్ కాటన్ అంటుకునే గుణాన్ని నిరోధిస్తుంది. ఆఫీస్​లకు వెళ్లేవారికి ఇది మంచి ఎంపిక.

Image Source: Pinterest/seothecotlin

ఇల్కల్

కర్ణాటక నుంచి వచ్చిన బెస్ట్ రకం ఇల్కల్. ఇది నూలు వస్త్రంతో, ఆర్ట్ సిల్క్ మిక్స్​తో వస్తుంది. ఇవి త్వరగా ఆరిపోతాయి.

Image Source: Pinterest/silkal_in

జమ్దాని

బెంగాల్, ఉత్తర ప్రదేశ్​ల నుంచి వచ్చిన సాంప్రదాయ నేత అయిన జమ్దాని అత్యంత తేలికైన ముస్లిన్ వస్త్రం. ఇది చూసేందుకు రిచ్​గా, కట్టుకునేందుకు కంఫర్ట్​గా ఉంటుంది.

Image Source: Pinterest/prakritihandloom7