గుర్తించవలసిన సంకేతాలు, లక్షణాలు
బి 12 తక్కువ ఉంటే రక్త కోశాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఏమి చేసినా.. ఏమి చేయకపోయినా అలసటగా ఫీల్ అవుతారు.
ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల చర్మం, కళ్లు పాలిపోతాయి. కామెర్లు ఏర్పడి పసుపు రంగులోకి మారవచ్చు.
తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్లు వస్తాయి. B12 స్థాయిల తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. నరాల సంబంధిత ఇబ్బందులు కనిపిస్తాయి.
B12 లోపం హోమోసిస్టీన్ను పెంచుతుంది. దీనివల్ల డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ పెరుగుతాయి. మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి.
విరేచనాలు, మలబద్ధకం లేదా ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఉంటాయి. చిన్నవారితో పాటు పెద్ద వారిని కూడా బి12 ఈ రకంగా ప్రభావితం చేస్తుంది.
B12 లోపం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల మెదడు మందగించడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి.
B12 లోపం మొదటి సంకేతాల్లో వాపుతో కూడిన నోటి పుండ్లు ఉంటాయి. నాలుకపై కూడా ఈ సంబంధిత నొప్పులు ఉంటాయి.
పోషకాహార లోపం వల్ల నరాలకు నష్టం వాటిల్లడం వల్ల చేతులు, కాళ్ళలో సూదులు గుచ్చినట్లు లేదా తిమ్మిరి వంటి అనుభూతి కలుగుతుంది.
B12 లోపం వల్ల ఇతర సంకేతాలు కండరాల బలహీనత, సమన్వయ లోపం, దృష్టి సమస్యలు మొదలైనవి కావచ్చు.