శరీరంలో ఏ సమస్య వచ్చినా.. కొన్ని అవయవాలు మనకు సంకేతాలిచ్చి అప్రమత్తం చేస్తాయి. ముఖ్యంగా కళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ B12 లోపం వల్ల కంటి చూపు ఒకచోట ఏకాగ్రతతో నిలపడంలో ఇబ్బంది కలుగుతుంది. విటమిన్ B12 తగ్గితే కళ్లలో తేమ తగ్గుతుంది. వెలుగు పట్ల కళ్లు సున్నితంగా మారుతాయి. వెలుతురులో కళ్లు చాలా ఇబ్బంది పడతాయి. విటమిన్ B12 తగ్గితే కళ్లలో దురద చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12 లోపం వల్ల కళ్లు, చర్మం పాలిపోయి కనిపిస్తాయి. విటమిన్ B12 తగ్గినపుడు రాత్రి పూట చూపులో తేడా వస్తుంది. విటమిన్ B12 లోపం కంటి నాడుల మీద కూడా ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.