పెళ్లిల్లు, పేరంటాలు ఏవైనా సరే చీరకట్టాల్సిందే. మీరు పెళ్లిలో స్పెషల్ గా కనిపించాలంటే విద్యాబాలన్ ను ఫాలో అవ్వండి. హల్దీ ఫంక్షన్ వెళ్తున్నట్లయితే.. ఎల్లో కలర్ శారీకి మెజెంటా పింక్ బార్డర్ ఉన్న ఈశారీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. గ్రీన్ కలర్, వైట్ కలర్ మిక్సింగ్ శారీ ఆఫీసులకు వెళ్లేవారికి బాగుంటుంది. ఈమధ్య కాలంలో ప్రింటెండ్ చీరలు చాలా ఫ్యాషన్ అయ్యాయి. ప్రింటెడ్ పల్లు, ప్లెయిన్ శారీ బాగుంది కదూ. సల్వార్ సూట్సే కాదు చీరలకు బెల్టులు ధరించండం ఇప్పుడు ట్రెండ్. డిన్నర్లకు , బర్త్ డే పార్టీలకు బాగుంటుంది. రాయల్ లుక్ కనిపించాలంటే వైట్ కలర్ పర్ఫెక్ట్. వైట్ కలర్ కు మెరూన్ బార్డర్ శారీ ఎక్కువగా బెంగాలీలు కడుతుంటారు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న ఈ కాటన్ చీర సమ్మర్ లో బాగుంటుంది. పట్టుచీరలకు కాంచీపురం ఫేమస్. పెళ్లిళ్లకు ఎక్కువగా కాంచీపురం చీరలే కడుతుంటారు.