ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ సమస్య రావచ్చు. ఇది నేరుగా గుండెజబ్బులు, స్ట్రోక్ కు కారణం కాగలదు.

ఉప్పు తగ్గించి తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. ఫలితంగా కార్డియోవాస్క్యూలార్ సమస్యలు తగ్గుతాయి.

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. ఉప్పు మానెయ్యడం లేదా తగ్గించడం వల్ల ఈ ప్రమాదం తప్పుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు నిలువ ఉంటుంది. ఇది గుండె మీద మరింత భారాన్ని పెంచుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల మీద కూడా భారం పడుతుంది. ఉప్పు తగ్గించినపుడు కిడ్నీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఉఫ్పు ఎక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్ అవుతుంది. ఇది చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఉప్పు తగ్గిస్తే చర్మం అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాల వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. కనుక బరువు పెరుగుతారు.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇది అసౌకర్యానికి కారణం అవుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.