షాంపూతో తలస్నానం చేసిన తర్వాత యాపిల్ వెనిగర్‌ను నీళ్లలో కలిపి జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి.

రెండు చెంచాల యాపిల్ వెనిగర్‌ను స్ప్రే బాటిల్‌లో కలిపి అప్పుడప్పుడు జుట్టుకు స్ప్రే చేసుకుంటూ ఉండాలి.

వారానికి ఒకసారి టీ ట్రీ ఆయిల్, యాపిల్ వెనిగర్‌ను కలిపి జుట్టుకు మర్దన చేసి షాంపుతో తలస్నానం చేయాలి.

యాపిల్ వెనిగర్, నీళ్లు, కలబందను కలిపి జుట్టుకు పట్టించిన కాసేపటి తర్వాత షాంపూ లేకుండా నీటితో తలస్నాం చేయాలి.

తనస్నానం తర్వాత యాపిల్ వెనిగర్, క్యామోమైల్ టీను కలిపి జుట్టును మరోసారి కడగాలి.

ఆస్పిరిన్ టాబ్లెట్లను దంచి, యాపిల్ వెనిగర్‌లో కలిపి జుట్టుకు మర్దన చేసిన తర్వాత కేవలం కండీషనర్‌తో తలస్నానం చేయాలి.

నిమ్మకాయ రసం, యాపిల్ వెనిగర్‌ను కలిపి జుట్టుకు పట్టించి అరగంట వదిలేసి ఆపై తలస్నానం చేయాలి.

సూచన: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (All Images Credit: Pexels)