ఈ వయసులోనూ హాట్ హాట్‌గా జ్యోతిక - ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదే హీరోయిన్ జ్యోతిక ఈ వయస్సులోనూ ఫిట్‌గా ఉండేందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఒకప్పుడు బొద్దిగా ఉండే జ్యోతిక.. ఒప్పుడు భలే సన్నగా మారిపోయారు. ఫిట్నెస్, డైట్ విషయంలో జ్యోతిక చాలా మార్పులు చేశారట. దీంతో బరువు తగ్గినట్లు చెప్పారు. జ్యోతిక ఫిట్నెస్ రహస్యం ప్రతిరోజూ జిమ్ కు వెళ్లడం. తన ఫిట్నెస్ సెషన్స్ ను ఎప్పుడూ మిస్ చేసుకోదు. జ్యోతిక వ్యాయామానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. వెయిట్ లిఫ్టింగ్, హెడ్ స్టాండ్ వంటి వ్యాయామాలు తప్పకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే మీరు కూడా జ్యోతిక తరహాలో డైట్ ఫాలో అవ్వండి. ఆమె సమతుల్య భోజనం తీసుకుంటుంది. అందం, ఆరోగ్యం కోసం తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్ తీసుకుంటుంది. హైడ్రేట్ గా ఉండటం కూడా ఫిట్నెస్ లో భాగమే. జ్యోతిక తన డైట్ ఫ్లాన్ లో కచ్చితంగా హైడ్రేషన్ మెనూ ఉంటుంది.