శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఉన్నాయి. వీటి ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తీసుకోవాలి.

ఒమెగా3 ఫ్యాటీఆసిడ్లు పుష్కలంగా ఉండే సాల్మన్ వంటి చేపలు కిడ్నీల ఆరోగ్యానికి కూడా అవసరమే.

బ్లూబెర్రీలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి ఇన్ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

పాలకూర, కాలే వంటి సూపర్ ఫూడ్స్ లో విటమిన్లు A, C, ఐరన్ చాలా ఎక్కువ. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి అవసరం.

విటమిన్లు A, C, B6 కలిగిన క్యాప్సికం ఆక్సిడేటివ్ ఒత్తిడిని నివారించి కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బీపీ అదుపులో ఉంచి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్లు A, Cతోపాటు ఫైబర్ కలిగి చిలగడ దుంపలు బ్లడ్ షుగర్‌ను అదుపు చేసి కిడ్నిల పనితీరును మెరుగ్గా ఉంచుతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.