మృదువైన జుట్టు కావాలా? కొరియన్ రైస్ వాటర్ ట్రై చెయ్యండి మీకు పొడువాటి జుట్టు కావాలంటే కొరియన్ రైస్ వాటర్‌ను ప్రయత్నించండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్ధాలు. బియ్యం, నీళ్లు.. ఈ రెండింటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యంలో రెండు కప్పుల నీరు పోయండి. మీడియం మంట మీద నీటిని మరిగించండి. తర్వాత అందులో బియ్యం వేసి మూత పెట్టండి. అన్నం మెత్తబడే వరకు 15 నుంచి 20 నిమిషాలు ఉడికించాయి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులోకి గంజిని వంపుకోండి. ఈ గంజి నీళ్లను చల్లారిన తర్వాత ఫ్రిజ్ పెట్టండి. తర్వాత ఈ రైస్ వాటర్‌ను హెయిర్ మాస్క్, హెయిర్ టోనర్‌గా ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేసినట్లు జుట్టు పెరగడంతోపాటు మంచి షైనింగ్ కూడా వస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.