శాకాహారం ఎప్పుడైనా ఆరోగ్యకరమే. కానీ వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు తినకపోవడం మంచిది.

వర్షాకాలంలో కూరగాయల్లో తేమ ఎక్కువ చేరుతుంది. ఇది ఎక్కువ పురుగుమందులు పీల్చుకునేందుకు కారణం అవుతుంది.

అలాంటి వాటిలో ఆకుకూరలు ఒకటి. పురుగు మందు అవశేషాలు మాత్రమే కాదు. వర్షాకాలంలో ఆకుకూరలు త్వరగా చెడిపోతాయి కూడా.

వంకాయల్లో ఆల్కలైన్స్ అనే కెమికల్స్ విడుదలవుతాయి. కనుక ముందు జాగ్రత్తగా వర్షాకాలంలో వీటిని తినొద్దు.

తేమ ఎక్కువ చేరడం వల్ల కాప్సికంలో గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి వికారానికి కారణం కావచ్చు. కనుక వర్షాకాలంలో వద్దు.

క్యాబేజిలో ఉండే తేమ వల్ల ఇవి బ్యాక్టీరియా పెరిగేందుకు అనుకూలం. కనుక వర్షాకాలంలో వాడకపోవడమే మంచిది.

కాలీఫ్లవర్ లో కూడా ఇవే కెమికల్స్ ఉంటాయి. కనుక వర్షాకాలం మానేస్తే బెటర్.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే