ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

ఫిబ్రవరి 7న మెుదలయ్యే వాలెంటైన్స్ వీక్.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.

ప్రేమ అనేది అందరికీ చెందిన విషయమే.. కానీ వాలెంటైన్స్ డే మాత్రం కాదు.

కొన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవం జరుపుకోరు.

సౌదీ అరేబియాలో బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడం నిషేధం.

ఉజ్బెకిస్తాన్ లో 2012 వరకు వాలెంటైన్స్ డే వేడుకలు నిర్వహించేవారు. కానీ తరువాత నిషేధించారు.

ఇండోనేషియాలో నిషేధం లేదు. కానీ ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకోవడం స్వచ్ఛందంగా ఆపేశారు.

ఇరాన్‌లో వాలెంటైన్స్ డే స్థానంలో మెహ్రేఖాన్‌తో అనే పండుగను నిర్వహిస్తారు.

పాకిస్థాన్‌లోనూ వాలెంటైన్స్ డే వేడుకులను నిషేధించారు.

2005 నుండి మలేషియాలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొన్ని దేశాలలో యాంటీ వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటారు.