బంగాళదుంపలపై మొలకలను చాలామంది చూసే ఉంటారు. చాలామంది దానిని తీసేసి వండేసుకుంటారు.

ఇంతకీ బంగాళదుంపలపై మొలకలు ఉంటే వాటిని వండి తినొచ్చా? లేదా?

బంగాళదుంపలపై మొలకలు వచ్చినప్పుడు ఆకుపచ్చగా మారతాయి.

గ్లైకోఅల్కలాయిడ్స్, సోలనిన్, చాకోనిన్​లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సహజమైన విషపదార్థాలు.

వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఇది ఆరోగ్యానికి హానికరం కావొచ్చు.

కొందరిలో వాంతులు, కడుపు తిప్పడం, డయేరియా, కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు నాడీ సంబంధిత లక్షణాలు ఉంటాయి.

మొలకలు చిన్నగా ఉండి బంగాళాదుంప గట్టిగా ఉంటే వాటిపై తొక్కలను తీసి ఉడికించుకుని తీసుకోవచ్చు.

బంగాళదుంప మెత్తగా, ముడతలు పడి, ఆకుపచ్చగా, మొలకలు ఉంటే వాటిని పడేయడం మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.