బయటి నుంచి తెచ్చిన టిఫిన్ తినడం కంటే ఇంట్లో చేసుకుతినడం చాలా ఆరోగ్యకరం.

అయితే ఇడ్లీ, దోశల కోసం పిండి రెడీ చేసుకోవడం ఒక ప్రహసనం.

అందుకే చాలా మంది ఈ మధ్య రెడీమెడ్ ఇడ్లీ, దోశల పిండి తెచ్చుకుని టిఫిన్ ఇంట్లో చేసుకున్నామని తృప్తి పడుతున్నారు.

ఇది కూడా అంత సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిండి ఎక్కువ కాలం పాటు నిలువ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ఎలాగూ ఉంటాయి.

ఇవే కాకుండా వీటిని ప్యాక్ చేసే ప్యాకెట్లలో పిండి పులవ కుండా బోరిక్ ఆసిడ్ కోటింగ్ వేస్తారు.

ఇది కడుపులో చేరి పేగులకు హాని చేస్తుంది.

కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు, చర్మం పొడిబారటం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. Pexels