వాడేసిన టీ పౌడర్ తో ఇన్ని లాభాలున్నాయా? ప్రతి ఒక్కరు పొద్దున్నే లేవగానే వేడి వేడి టీతో రోజును ప్రారంభిస్తారు. టీ కాచి వడపోసిన తర్వాత టీ పౌడర్ మిగులుతుంది. వాడేసిన టీ పౌడర్ ను చాలా మంది డస్ట్ బిన్ లో పడేస్తారు. కానీ, వాడేసిన టీ పౌడర్ తో చాలా లాభాలున్నాయి. వాడేసిన టీ పౌడర్ ను నీటిలో మరిగించి ఆ వాటర్ తో ఇంట్లోని అద్దాలను శుభ్రం చేసుకోవచ్చు. వాడేసిన టీపౌడర్ ను నీళ్లలో మరిగించి చల్లారాక పాదాలను అందులో ఉంచితే అందంగా తయారవుతాయి. వాడేసిన టీపౌడర్ మరిగించిన నీటిని తలకు రాస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. వాడేడేసిన టీ పౌడర్ మొక్కలకు వేస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: Social Media.com