థైరాయిడ్ క్యాన్సర్స్ రకాలు.. ఏది ప్రమాదమంటే

Published by: Geddam Vijaya Madhuri

థైరాయిడ్ గ్రంథి.. శరీర జీవక్రియ, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రిస్తుంది.

ఈ గ్రంథిలో మార్పులు జరిగితే థైరాయిడ్ సమస్య వస్తుంది. కొందరిలో హైపో, హైపర్ రావచ్చు.

వైద్యుల ప్రకారం కొందరికి థైరాయిడ్ క్యాన్సర్ రావచ్చు. అయితే దీనిలో ఐదు వేర్వేరు రకాలు ఉన్నాయి.

ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. శస్త్రచికిత్స లేదా రేడియోధార్మిక అయోడిన్ చికిత్సతో 100% కోలుకోవడం సాధ్యమవుతుంది.

హర్తల్ సెల్ క్యాన్సర్ - ఇది అరుదైనది. కొద్దిగా దూకుడుగా ఉండే రకం. ఇది సంవత్సరాల తర్వాత తిరిగి రావచ్చు.

ఈ విషయంలో రేడియోధార్మిక అయోడిన్ ఎల్లప్పుడూ పనిచేయకపోవచ్చు. కాబట్టి రోగిని చాలా కాలం పాటు పర్యవేక్షించడం అవసరం.

ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్. కొన్నిసార్లు ఎముకలు లేదా ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందుతుంది.

సమయానికి శస్త్రచికిత్స చేస్తే దీని ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి.

అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఇది చాలా అరుదైనది. కానీ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది.