ACని 24°C లేదా 25°Cకు సెట్ చేయడం వల్ల, చల్లదనం సరిపోతుంది, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.

ప్రతి 2 వారాలకు ఫిల్టర్ శుభ్రం చేయండి. దుమ్ము పేరుకుంటే AC మరింత శక్తిని వాడుతుంది.

ACతో పాటు సీలింగ్ ఫ్యాన్ వాడితే, చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. ACని తక్కువ టైం ఆన్ చేసినా చాలు.

గదిలో ఉన్న డోర్లు, విండోలు బాగా మూసివేసి బయట గాలి లోపలికి రాకుండా చూడండి.

గదిలోకి సన్‌లైట్ రాకుండా కర్టెన్లు వాడండి. ఇవి గది వేడెక్కకుండా చేస్తాయి.

గదిలో ఎవరూ లేని సమయంలో AC ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.

ఏడాది కనీసం ఒక్కసారైనా AC సర్వీస్ చేయించండి. లోపల బ్లాక్, గ్యాస్ సమస్యలు ఉంటే అవి బిల్లును పెంచుతాయి.

ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న AC వాడండి

ఇది సాధారణ ACలకన్నా 30-40% తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది.