ఎయిడ్స్‌తో 48 మంది విద్యార్థులు మృతి - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

త్రిపురాను ఎయిడ్స్ వణికిస్తోంది. ఈ వ్యాధితో 48 మంది విద్యార్థులు చనిపోయారు.

డ్రగ్స్ తీసుకొనే సిరంజీల ద్వారా హెచ్ఐవీ సంక్రమించినట్లు సమాచారం.

త్రిపురాలో వివిధ ఇనిస్టిట్యూట్స్‌లో చదువుతున్న 800 పైగా విద్యార్థులు ఎయిడ్స్‌తో చికిత్స పొందుతున్నారు.

ఎయిడ్స్.. ఫస్ట్, సెకండ్ స్టేజ్ లక్షణాలు: తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అతిసారం, బరువు తగ్గిపోవడం.

రాత్రివేళల్లో చెమట పట్టడం, దగ్గు, మెడ దగ్గర ఉండే శోషరస గ్రంధుల వాపు కూడా ఈ లక్షణాల్లో భాగమే.

నోటిలో పుండ్లు, కండరాల నొప్పులు, గొంతు నొప్పి లక్షణాలున్నా డాక్టర్‌ను సంప్రదించాలి.

మూడో స్టేజ్‌లో ఇమ్యునిటీ పూర్తిగా నశిస్తుంది. త్వరగా రోగాలకు గురవ్వుతారు.

మూడో స్టేజ్‌లో తీవ్రంగా చెమటలు పట్టేస్తాయి. శరీరం వణికిపోతుంది.

డయేరియా వల్ల నీళ్ల విరోచనలు అవుతాయి. నాలుక, నోటిపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి.

వ్యాధి ముదిరాక బాగా బలహీనంగా మారిపోతారు. మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంది.