మీ చీర అందాన్ని పెంచే U నెక్ బ్లౌజ్ డిజైన్స్ పై ఓ లుక్కేయ్యండి చీర అందాన్ని పెంచేది బ్లౌజ్. చీరకు తగ్గట్లుగా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యు నెక్ డిజైన్ చాలా పాపులర్ అయ్యింది. పట్టు, సింథటిక్, కాటన్ ఏ చీర అయినా సరే యు నెక్ డిజైన్ బ్లౌజ్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ప్లెయిన్ చీరకు ఎంబ్రాయిడరీ చేసిన యు నెక్ బ్లౌజ్ అన్ని ఫంక్షన్లకు బెస్ట్ లుక్ అందిస్తుంది. షీర్ యూ నెక్ బ్లౌజ్ ఈవినింగ్ పార్టీలకు, ఈవెంట్లకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. యు నెక్ కు ఎన్నో రకాల డిజైన్ లను కూడా జోడించవచ్చు. చీర అప్పీల్ పెంచేందుకు బాగుంటుంది. స్లీవ్ లెస్ యు నెక్ బ్లౌజ్ ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. డీప్ బ్యాక్ లెస్ యు నెక్ బ్లౌజ్ తో మీ చీర లుక్ అదిరిపోతుంది. అందరికీ నప్పుతుంది.