ట్రావెల్ చేస్తున్నారా? ఖర్చును తగ్గించుకునేందుకు ఇవి ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

ట్రావెల్ చేయడాన్ని చాలామంది ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను సందర్శించి.. వాటి జ్ఞాపకాలతో ఎంజాయ్ చేస్తారు.

Image Source: Canva

ఆ సమయంలో కొన్నిసార్లు తెలియక ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అవి మీ పూర్తి మూఢ్ డిస్టర్బ్ చేస్తాయి.

Image Source: Canva

ఎక్కడికి వెళ్లినా ఖాళీ సీసాను తీసుకెళ్లండి. ఇది మీరు ఊరికే బాటిల్స్ కొనాల్సిన పరిస్థితిని తగ్గిస్తుంది. లోకల్గా దొరికే మంచి నీటిని తాగవచ్చు.

Image Source: Canva

గైడె అవసరం లేకుండా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్, ఇతర ఉచిత ప్రయాణాలపై దృష్టి పెట్టండి.

Image Source: Canva

చౌకైన ప్రయాణం కోసం మెట్రో, బస్సు లేదా ఊబర్ లేదా ఓలా వంటి ఆన్లైన్ క్యాబ్లను ఎంచుకోండి.

Image Source: Canva

పర్యాటక ప్రదేశానికి కొంచెం దూరంలో ఉండే స్థానిక ధాబాల్లో లేదా చిన్న హోటళ్లలో ఫుడ్ తినండి. ఖర్చు తగ్గుతుంది.

Image Source: Canva

అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను కొనుగోలు చేయడానికి బదులుగా స్థానిక సిమ్ కార్డ్ తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది.

Image Source: Canva

మీ ఏరియాలో లేదా ఈజీగా దొరికే వస్తువులను కొనవద్దు. అర్థవంతమైనవి మాత్రమే కొనుక్కోండి.

Image Source: Canva

చివరి నిమిషంలో విమానం లేదా హోటల్ బుకింగ్‌లు కాకుండా ముందుగా ప్లాన్ చేసుకుంటే ఖర్చు చాలావరకు తగ్గుతుంది.

Image Source: Canva