దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అయితే దీనిని పొడి చేసుకుని రెగ్యులర్​గా తీసుకుంటే మరిన్ని ఫలితాలుంటాయి.

దాల్చిన చెక్క పొడిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్​ని రెగ్యులేట్ చేస్తాయి.

కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని దూరం చేస్తాయి.

దాల్చిన చెక్కపొడిలో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తాయి.

బ్రెయిన్ హెల్త్​ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ సమస్యను దూరం చేస్తుంది.

గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. మెటబాలీజం పెంచి.. షుగర్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

దాల్చిన చెక్కను పొడి చేసి.. సలాడ్స్​లో లేదా నీటిలో వేసి తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది.