భారతదేశం వ్యవసాయం దేశం. ఇక్కడ వరిని పెద్ద ఎత్తులో సాగు చేస్తారు.

వరిపై ఆధారపడిన రైతులు ఇండియాలో బాగా ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ బియ్యం ఉత్పత్తి ఎక్కువ.

మరి ఇండియాలో ఏ రాష్ట్రంలో వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.

భారత్​లో 166.31 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.

తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవడం, నీటి స్టోరేజ్ పెరగడంతో వరి సాగు ఎక్కువగా ఉంది.

156.31 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తూ ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.

151.18 లక్షల మెట్రిక్ టన్నుల వరిని పండిస్తూ పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉంది.

143.90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తూ పంజాబ్ నాలుగో స్థానంలో ఉంది.

ఒడిశా 101.30 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తూ 5వ స్థానంలో ఉంది.

తమిళనాడు, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా వరి ఉత్పత్తి ఎక్కువగా ఉంది.