కూరలో లేదా ఇతర వంటల్లో నూనె ఎంత ఎక్కువ వేస్తే రుచి అంత ఎక్కువగా ఉంటుంది.

కానీ నూనె ఎక్కువగా తీసుకుంటే వివిధ సమస్యలు వస్తాయి. కాబట్టి నూనె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.

వంటకు ఉపయోగించే నూనె సరైనదే ఉండాలి. అలాగే సరిగ్గా వండడం నేర్చుకోవాలి.

ఆలివ్ ఆయిల్ వంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సలాడ్స్లో ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.

ఒకటే నూనెను రోజూ వాడడం కాకుండా మారుస్తూ ఉండాలి. అంటే ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలా మార్చాలి.

వంటనూనెను మళ్లీ మళ్లీ వంటలకు వినియోగించడం మంచిది కాదు. ఫ్యాట్స్ పెరుగుతాయి.

వ్యక్తిని బట్టి రోజుకు 2 నుంచి 3 టీస్పూన్ల నూనెను మాత్రమే వినియోగించాలి.

బరువు తగ్గాలనుకునేవారు, గుండె సమస్యలున్నవారు వీలైనంత తక్కువగా నూనె తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.