ప్రతిరోజు నడిస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలివే

క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. బలం వస్తుంది. దీర్ఘాయువు కోసం ఇది ఆరోగ్యకరమైన అలవాటు ఏర్పడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలను తగ్గిస్తుంది. శరీర కొవ్వును తగ్గిస్తుంది. బరువును సమతుల్యం చేస్తుంది.

ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తుంది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. కండరాలను బలపరుస్తుంది. ఎముకలు, కీళ్ళను బలపరుస్తుంది.

ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెదడు శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో శక్తి, తాజాదనాన్ని ఉత్పత్తి చేస్తుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

మూడ్, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది.

మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. ఇది నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది. గాఢ నిద్రను కలిగిస్తుంది.

శక్తిని పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది.