మామిడి పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు. అందుకే దీనిని పండ్లలో రారాజు అంటారు.

ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా.. శరీరంలోని ఖనిజాల లోపాన్ని కూడా ఇది తీరుస్తుంది.

దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. లిమిట్ దాటితే బరువు పెంచుతుంది.

రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేసి.. చర్మానికి మెరుపును కూడా ఇస్తుంది.

మరి ఈ టేస్టీ టేస్టీ మామిడి పండ్లను ఏ దేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిని ఉత్పత్తి చేసే దేశం ఇండియానే.

మన తర్వాత చైనా ఎక్కువగా మామిడి పండ్లు ఉత్పత్తి చేస్తూ రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలో థాయిలాండ్ ఉంది. అక్కడ మామిడి ఉత్పత్తి మెరుగ్గానే ఉంటుందట.

మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఇండోనేషియా ఉంది.

పాకిస్తాన్, బ్రెజిల్, ఆఫ్రికా, బంగ్లాదేశ్​లో కూడా మామిడి ఉత్పత్తి ఎక్కువగానే ఉంది.