సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు స్కిన్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

ఆల్కహాల్, ఫ్రాగ్రెన్స్, సల్ఫేట్ అధికంగా ఉండే సబ్బులు, ఫేస్ వాష్​లను అవాయిడ్ చేయాలి. pH బ్యాలెన్స్ చేసేవి వాడాలి.

కొత్త స్కిన్ కేర్ లేదా మేకప్ ప్రొడెక్ట్ అప్లై చేసేప్పుడు ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

రెగ్యులర్​గా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది స్కిన్​కి బారియర్​గా పని చేస్తుంది.

మినరల్స్​తో కూడిన సన్​స్క్రీన్ ఉపయోగిస్తే మంచిది. కెమికల్స్ ఉండేవి వాడకండి.

ఎక్కువ ప్రొడెక్ట్స్ కాకుండా.. మీకు కంఫర్ట్​ ఉండే వాటినే ఉపయోగిస్తే మంచిది.

ముఖాన్ని వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో లేదా చల్లని నీటితో వాష్ చేసుకోవాలి.

ఆల్కహాల్, పారాబెన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఎక్స్​ఫోలియేటింగ్ యాసిడ్స్ వాడకపోవడమే మంచిది.

కలబంద, సెరామిడ్స్, నియాసినమైడ్ వంటివి మంటను తగ్గించి రిలీఫ్​ని ఇస్తాయి.

వారానికోసారి ఎక్స్​ఫోలియేట్ చేస్తే మంచిది. దీనికోసం మైల్డ్​ ప్రొడెక్ట్స్ ఎంచుకోవాలి.