వీసా లేకుండా వేసవిలో సందర్శించదగిన టాప్ 10 ప్లేసెస్

Published by: Jyotsna

థాయిలాండ్:

అద్భుతమైన బీచ్‌లు, జీవంతమైన నైట్‌లైఫ్, సంపన్న సాంస్కృతిక వారసత్వంతో థాయిలాండ్ ఒక ప్రధాన గమ్యస్థానం.

ఇండోనేషియా (బాలి):

బీచ్ ప్రేమికులకు బాలి స్వర్గధామం. ఆకర్షించే ప్రకృతి దృశ్యాలు, సాహస క్రీడలు, సాంస్కృతిక అనుభవాలను అందిస్తుంది.

మాల్దీవులు:

లగ్జరీ ఓవర్‌వాటర్ విల్లాలు , స్వచ్ఛమైన నీళ్ల బీచ్ కు ప్రసిద్ధి చెందిన మాల్దీవులు, భారతీయ ప్రయాణీకులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందిస్తుంది.

మారిషస్:

ఈ దీవి సెలవులకు వెళ్లదగ్గ ప్లేస్, అందమైన వాటర్ స్పోర్ట్స్‌ ఉండే ఈ ప్రాంతానికి భారతీయ పాస్‌పోర్ట్ ఉంటే చాలు.

శ్రీలంక:

బీచ్‌లు, పచ్చని కొండలు, చారిత్రక ప్రదేశాలు సమృద్ధిగా ఉన్న శ్రీలంక వీసా ప్రక్రియ చాలా సుళువు.

సీషెల్స్:

హనీమూన్ జంటలు, నేచర్ లవర్స్ గమ్యస్థానం, సీషెల్స్ . ఇది భారతీయ ప్రయాణీకులకు 30 రోజుల వరకు వీసా-రహిత ఎంట్రీ ఉంది.

భూటాన్:

హిమాలయాల్లో ప్రశాంతమైన విహారయాత్ర, ఆధ్యాత్మికత, సాహసం, అన్నింటినీ కలిపి అందిస్తుంది భూటాన్.

నేపాల్:

సాహసికులు , సాంస్కృతిక ఆసక్తులు కలిగినవారికి అనువైన నేపాల్, భారతీయులను వీసా లేకుండా, కేవలం చెల్లుబాటు అయ్యే ఐడీతో అనుమతిస్తుంది.

ఫిజీ:

ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు సాహస యాత్రకు కూడా అనుకూలమే.

జోర్డాన్:

చరిత్ర , సాహసం రెండూ ఇష్టపడేవారికి జోర్డాన్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందిస్తుంది.