కడుపుతో ఉన్నప్పుడు టమాటాలు తినొచ్చా? లేదా?

టమాటాల్లోని విటమిన్ సి గర్భిణీ స్త్రీలకు ఇమ్యూనిటీని అందిస్తుంది. ఐరన్ శరీరానికి అందేలా చేస్తుంది.

ఫోలోట్(Vitamin B9) బేబీ బ్రెయిన్, స్పైన్ డెవలప్మెంట్​కి హెల్ప్ చేస్తుంది. ట్యూబ్ డిఫెక్ట్స్​ని తగ్గిస్తుంది.

టమాటాల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది హైడ్రేషన్​ని అందిస్తుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కొన్ని జబ్బులు రాకుండా కాపాడుతాయి.

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలోని ఫైబర్ ప్రెగ్నెన్సీలో వచ్చే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సోడియం లెవెల్స్​ని, బీపీని మ్యానేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ప్రెగ్నెన్సీలో వచ్చే క్రేవింగ్స్​ని కంట్రోల్​లో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా మొదటి ట్రిమెస్టర్​లో తింటే మంచిది.

ఆరోగ్యానికి మంచిదే అయినా ఎక్కువగా, పచ్చిగా తింటే ఎసిడిటీ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

పెస్టిసైడ్స్ ఉపయోగించని టమాటాలు కూరలు, సూప్​లలో బాగా ఉడికించి తింటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.