వర్షాలు ఆడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ వివిధ ఆరోగ్య సమస్యలని కూడా తెస్తాయి. వాటిలో ఫుడ్ పాయిజిన్ కూడా ఒకటి. వివిధ కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లల నుంచి పెద్దలవరకు ఫుడ్ పాయిజిన్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. చుట్టూ హైజీన్‌గా ఉండేలా చూసుకోండి. కిచెన్‌లో కూడా డ్రైగా, వెట్‌గా ఉంచుకోవాలి. స్ట్రీట్ ఫుడ్‌ని కచ్చితంగా దూరం పెట్టాలి. ఒకవేళ తినాల్సి వస్తే అది ఫ్రెష్‌గా, వేడిగా ఉండేలా చూసుకోవాలి. నీటి నుంచి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి కాబట్టి నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటెబుల్స్ మార్కెట్‌నుంచి తెచ్చుకున్నాక కచ్చితంగా వాష్ చేయాలి. డెయిరీ ఉత్పత్తులు త్వరగా పాడైపోతాయి కాబట్టి.. వాటిని ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోండి. ఫుడ్ ఎక్స్పైయిరీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఫుడ్ పాయిజిన్ చేస్తుంది. మీరు వంట చేసుకోవాలనుకుంటే కచ్చితంగా దానిని బాగా ఉడికించి తీసుకోవాలి. తినక ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (Images Source : Envato)