వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. సిట్రస్ పండ్లలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. కాకరకాయలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. బచ్చలికూరలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పుంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ సిస్టమ్స్ ను బలంగా మార్చుతుంది. అల్లంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాససంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు, ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com