వేసవిలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపు చేసుకోవడం చాలా సులభం. కొద్దిగా శ్రద్ధ పెడితే మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవడం కష్టం కాదు.

హైడెన్సిటి కొలెస్ట్రాల్ అంటే హెచ్డీఎల్ పెంపొందించుకోవడం వల్ల బీపీ, గుండె జబ్బులను నివారించవచ్చు.

శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎల్డీఎల్ స్థాయిలు తగ్గించుకునేందుకు యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇది ఎల్డీఎల్ ను తగ్గిస్తుంది.

తప్పకుండా 20 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్, యోగా, కార్డియో వ్యాయామాల వంటివి ఏదో ఒకటి తప్పక చెయ్యాలి.

పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యడం అవసరం. ఇది రక్తంలో ప్లేక్ పేరుకోవడానికి, రక్తనాళాల్లో బ్లాకేజీకి కారణం అవుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇది జీర్ణక్రియ సజావుగా జరిగి పోషకాల శోషణకు తోడ్పడుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫూడ్ పూర్తిగా మానెయ్యాలి.

ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండడం అవసరం. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం.

ఆల్కాహాల్ అలవాటు ఉన్న వాళ్లు మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మానెయ్యగలిగితే మరింత మంచిది.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.



Thanks for Reading. UP NEXT

అంతరిక్షంలో ఈ తిండి ప‌దార్థాలు బ్యాన్.. ఎందుకంటే?

View next story