స్లీప్ షెడ్యూల్​ని ఫిక్స్ చేసుకోవాలి. రోజూ ఒకటే సమయానికి బెడ్ ఎక్కితే నిద్ర మంచిగా వస్తుంది.

పడుకునే ముందు బుక్ చదవడం లేదా మెడిటేషన్ చేస్తూ ఉంటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

మీ బెడ్​ రూమ్ మీకు కంఫర్ట్ ఉండే టెంపరేచర్​కి సెట్ చేసుకోండి. చీకటిగా, నిశబ్ధంగా ఉండేలా చూసుకోండి.

శరీరానికి మద్ధతునిచ్చే, విశ్రాంతిని అందించే పరుపును ఎంచుకోండి. ఇది నడుమునొప్పిని కూడా తగ్గిస్తుంది.

బ్లాక్ అవుట్ కర్టెన్లు లేదా షేడ్స్ ఉపయోగించినా మంచిది. ఇది మీ రూమ్​లోకి కాంతిరావడాన్ని తగ్గిస్తుంది.

బయటి సౌండ్స్ వల్ల ఇబ్బంది కలిగించకుండా ఇయర్​ప్లగ్స్, ఫ్యాన్స్ వాడుకోవచ్చు.

నిద్రకు గంట ముందు నుంచే ఫోన్​ని బంద్ చేయండి. స్క్రీన్ చూడడం వల్ల నిద్ర దూరమవుతుంది.

కెఫిన్, నికోటిన్ వంటి పదార్థాలను వినియోగం కూడా నిద్రను దూరం చేస్తుంది. కాబట్టి మానేస్తే మంచిది.

నిద్రకు ముందు పాదాలకు ఆయిల్ మసాజ్ చేస్తే నిద్ర సమస్యలు దూరమవుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.