పిల్లలకు ఎగ్జామ్స్​ ఫియర్​తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటిని ఇలా దూరం చేసేయండి.

పేరెంట్స్ వల్లే పిల్లలు ఎగ్జామ్స్ టైమ్​లో ఎక్కువగా ప్రెజర్​ ఫీల్​ అవుతున్నారని ఓ సర్వే తేల్చింది.

ఈ భయం పిల్లల్లో ఉంటే వారు చదివినది కూడా సరిగ్గా రాయలేని ప్రమాదముంటుంది.

పిల్లలు ఎగ్జామ్స్ పట్ల తమ భయం లేదా ఆందోళనను వ్యక్తం చేస్తే వారి భావోద్వేగాలను అర్థం చేసుకోండి.

ఎగ్జామ్స్​కి ముందు ఇలాంటి భయాలు సాధారణమని, దానిని ఓవర్​కామ్ చేయగలరని సపోర్ట్ ఇవ్వండి.

వారికి కష్టమైన సబ్జెక్ట్​లను ఈజీగా వివరించి చెప్పండి. లేదా సింపుల్ టెక్నిక్స్​ని నేర్పండి.

ఎగ్జామ్స్​కి ముందే పిల్లలకు ఓ షెడ్యూల్ క్రియేట్ చేయండి. ఇది వారికి ప్రెజర్​ లేకుండా చదువుకునేలా హెల్ప్ చేసేలా ఉండాలి.

బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా వంటి పద్ధతులను ఫాలో అయ్యేలా చూడండి. ఇవి ప్రెజర్​ని తగ్గిస్తాయి.

పిల్లలకు ఎగ్జామ్ టైమ్​లో కాస్త రిలీఫ్ అయ్యేందుకు గేమ్స్ ఆడడం, వారికి నచ్చిన ప్రోగ్రామ్ చూసే వెసులుబాటు కల్పించాలి.

పిల్లలు ఎగ్జామ్ రాయడం వరకే బాధ్యత అని.. రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోవద్దని చెప్పండి.