వింటర్లో బట్టలు ఆరేస్తే అంత త్వరగా ఆరవు. ఈ సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే త్వరగా ఆరిపోతాయి. డ్రైయింగ్ ర్యాక్ ఒకటి తీసుకుంటే.. వెంటిలేషన్, గాలి వచ్చే ప్రదేశంలో దుస్తులు ఆరబెట్టుకోవచ్చు. దుస్తులను ఒకదానిపై ఒకటి కాకుండా.. ఆరేందుకు వీలుగా విడిగా ఆరేస్తే త్వరగా ఆరుతాయి. ఫ్యాబ్రిక్స్‌ని బట్టి కాకుండా.. అన్ని మిక్స్ చేస్తూ ఆరేయడం వల్ల త్వరగా ఆరుతాయి. చలి ఎక్కువగా లేనప్పుడు డ్రెస్‌లు బయట, ఎండ ఉండే ప్రదేశంలో ఆరబెడితే సరి. బయట ఆరేసినప్పుడు దుస్తులు ఎగిరిపోకుండా, కిందపడకుండా క్లిప్స్ సపోర్ట్ తీసుకోవాలి. ఆరుబయట డ్రెస్‌లు ఆరేసినప్పుడు మరీ చీకటి పడేవరకు ఉండకుండా ముందే తెచ్చుకుంటే మంచిది. లేదంటే దుస్తులు చల్లగా మారి, తేమతో నిండిపోతాయి. కాబట్టి సాయంత్రం ఆరులోపే తీసేస్తే మంచిది. దుస్తులలోని తేమను పోగొట్టే డ్రైయింగ్ బాల్స్, డిస్క్‌లు తేమను పీల్చుకుని ఆరడంలో హెల్ప్ చేస్తాయి. ఉన్ని వంటి డ్రెస్‌లను వేడికి నేరుగా ఆరబెడితే వాటి షేప్ మారిపోతాయి. కాబట్టి ఎండలేని ప్రదేశాల్లో ఆరేస్తే మంచిది.