కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం చాలా సింపుల్​ అని చెప్తున్నారు.

ముందుగా ఫ్రెష్ ధనియాలు తీసుకోవాలి. వాటిని కాస్త క్రష్ చేయాలి.

ఇప్పుడు ఓ కుండీని సిద్ధం చేసుకోవాలి. దానిని ఎండ వచ్చే ప్రదేశంలో పెట్టుకోవాలి.

ఇప్పుడు గార్డెన్ మట్టి, కంపోస్ట్ వేసి.. న్యూట్రిషన్ పుష్కలంగా ఉండే మట్టిని సిద్ధం చేసుకోవాలి.

ఇప్పుడు క్రష్ చేసిన ధనియాలను వేసి.. ఇప్పుడు దానిలో ఓ అరఅంగుళం మట్టి వేయాలి.

దానిపై కాస్త నీటిని చల్లాలి. అలాగే నీటిని ఎక్కువగా వేయకూడదు.

ఈ కుండీని రోజులో 4 నుంచి 6 గంటలు ఎండలో ఉంచాలి. అలా అని ఎండ మరీ ఎక్కువ ఉండేప్పుడు పెట్టకూడదు.

7 నుంచి 10 రోజుల్లో మొలకలు వస్తాయి. మొక్కలు పెరగడం స్టార్ట్ అవుతాయి.

రోజుకు కనీసం 1 లేదా రెండు రోజులకు ఓసారి నీటిని పోయాలి. ఎక్కువ నీటిని వేయకూడదు.

అవి కాస్త పెరిగిన తర్వాత కట్ చేసుకోవాలి. మొత్తానికి పీకకుండా కట్ చేసుకోవచ్చు.

తర్వాత అవి మళ్లీ పెరుగుతాయి. వాటిని మళ్లీ వాడుకోవచ్చు.