మైగ్రేన్ నిర్వహణలో హెల్ప్ చేసే 9 జీవనశైలి మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

నిద్ర సమయం

ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన నిద్రను అందిస్తుంది. ఇది మైగ్రేన్​ను దూరం చేస్తుంది.

Image Source: Canva

వ్యాయామం

వారంలో మూడు నుంచి ఐదు సార్లు.. రోజుకు 30 నుంచి 50 నిమిషాల పాటు మితమైన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇది మైగ్రేన్ తీవ్రతను తగ్గిస్తుంది.

Image Source: Canva

స్ట్రెచ్ చేయడం

శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంటే మంచిది. అలాగే వాకింగ్, ఈత వంటివి విశ్రాంతిని అందిస్తాయి. ఇవి మీరు వ్యాయామం వైపు వెళ్లేందుకు హెల్ప్ చేస్తాయి.

Image Source: Canva

హెల్తీ ఫుడ్

భోజనం మానేయడం లేదా ఉపవాసం చేయడం వల్ల మైగ్రేన్లు వస్తాయి. అందువల్ల తరచుగా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి.

Image Source: Canva

హైడ్రేషన్

మైగ్రేన్ల సమయంలో నీటిని కచ్చితంగా తీసుకోవాలి. నీటిని తాగకపోతే డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. అవి మైగ్రేన్ ఇబ్బందులను పెంచుతాయి.

Image Source: Canva

కెఫిన్

కెఫిన్ అధికంగా తీసుకుంటే.. మైగ్రేన్లు ప్రేరేపిస్తుంది. కెఫిన్ మానేస్తే కొందరికి మైగ్రేన్ వస్తుంది. కాబట్టి అలాంటివారు మితంగా తీసుకుంటే మంచిది. నిద్రకు ముందు తీసుకోకూడదు.

Image Source: Canva

ధూమపానం, మద్యపానం

ధూమపానం, మద్యం మానేస్తే మంచిది. ఎందుకంటే ఇవి మైగ్రేన్ ఎఫెక్ట్ పెంచుతాయి. కాబట్టి వాటిని తగ్గించడం లేదా పూర్తిగా మానడం మంచి ఫలితాలు ఇస్తాయి.

Image Source: Canva

ఒత్తిడి

ఒత్తిడిని దూరం చేసి.. విశ్రాంతినిచ్చే వ్యాయామాలు చేయాలి. ధ్యానం, మెడిటేషన్ వంటివి చేస్తే మైగ్రేన్​ను తగ్గిస్తాయి.

Image Source: Canva

బరువు

ఆహారం, వ్యాయామం, నిద్రతో బరువును కంట్రోల్ చేసుకోవాలి. దీనివల్ల మైగ్రేన్ ఫ్రీకెన్సీ తగ్గుతుంది.

Image Source: Canva