చాలామందికి చేతులు గరుకుగా ఉంటాయి. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు.

అయితే చేతులను మృదువుగా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

హైడ్రేషన్ చాలా ముఖ్యం. చేతులు మృదువుగా మార్చుకునేందుకు హైడ్రేటింగ్ క్రీమ్ వాడితే మంచిది.

గ్లిసరిన్, షియా బటర్, అలో వెరా వంటి క్రీమ్​లు రోజుకు 2 లేదా మూడుసార్లు ఉపయోగిస్తే మంచిది.

చేతులకు కఠినంగా ఉండే సోప్స్ కాకుండా.. సహజమైన ఆయిల్స్​తో ఉపయోగించే హ్యాండ్ వాష్​లు వాడాలి.

pH-బ్యాలెన్స్ ఉండే హ్యాండ్ వాష్, మాయిశ్చరైజర్స్ ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

పంచదార, తేనె లేదా ఆలివ్​ ఆయిల్​ కలిపి చేతులను స్క్రబ్ చేస్తే మంచిది.

వారానికోసారి ఇలా ఎక్స్​ఫోలియేట్ చేస్తే మంచిది. దీనివల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగుతాయి.

గిన్నెలు కడిగేప్పుడు, బట్టలు ఉతికేప్పుడు గ్లవ్స్ వేసుకుంటే మంచిది. దీనివల్ల గరుకుతనం తగ్గుతుంది.

రాత్రుళ్లు చేతులకు హ్యాండ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనె రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.