కొన్నిసార్లు మన ఆలోచనలే మనల్ని ఇబ్బందుల్లో తోసేస్తాయి. కాబట్టి వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి.

అయితే ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

రోజుకు కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. శ్వాసపై దృష్టి పెడితే ఆలోచనలు కంట్రోల్ అవుతాయట.

మల్టీ టాస్కింగ్ కాకుండా ఒక్కపనిపై ఫోకస్ చేయడం నేర్చుకోండి. ఇది మిక్స్​స్డ్ ఆలోచనలు తగ్గిస్తుంది.

అనవసరమైన ఆలోచనలు మానేసి.. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఫోకస్ చేస్తే మంచిది.

డిజిటల్ డిటాక్స్ పాటించండి. ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.

మీ మనసులో ఉన్న వాటిని డైరీలో రాసుకుంటే రిలీఫ్ ఉంటుంది. క్లారిటీ కూడా వస్తుంది.

నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్​గా మార్చుకోండి. చేయలేని వాటి గురించి కంటే చేసే వాటిపై ఫోకస్ చేయండి.

రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఒత్తిడి తగ్గుతుంది.

మెరుగైన నిద్ర చాలా అవసరం. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.