నోటికి రుచికి ఉండే ఫ్రూట్స్​లో సీతాఫలం ఒకటి. ఇది మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

దీనిలో సహజమైన షుగర్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్​ను పెంచుతాయని చెప్తున్నారు.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తినకపోవడమే మంచిదట. మోడ్రేషన్​లో తీసుకోవచ్చు.

ఒబెసిటీతో ఇబ్బంది పడేవారు బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని తినకూడదని చెప్తున్నారు.

రెగ్యులర్​గా యాక్టివ్​గా ఉండనివారు దీనిని ఎక్కువగా తీసుకంటే బరువు పెరిగిపోతారట.

మలబద్ధకం సమస్యతో ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.

సీతాఫలం కొందరికి అలెర్జీలను ఇస్తుంది. దురద, వాపు వంటి లక్షణాలు రావొచ్చు.

ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కూడా నిపుణుల సలహాలు తీసుకుని వీటిని తింటే మంచిదట.