ధ్యానం ఒత్తిడిని దూరం చేసే ఒక గొప్ప సాధనం. మైండ్ ఫుల్నెస్ మెడిషేషన్ ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తుంది. బలమైన అనుబంధాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆత్మీయులతో గడిపేందుకు తప్పకుండా సమయం కేటాయించాలి. లావెండర్, చెమోమిలే వంటి సువాసనలు మూడ్ ను ఎలివేట్ చేస్తాయి. వీటి కోసం డిఫ్యూజర్ లేదా శరీరం మీద కూడా వాడవచ్చు. పేయింటింగ్, డ్రాయింగ్, సంగీతం లేదా ఏదైనా ఆట వంటివి కూడా మనసును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతాయి. దీర్ఘ శ్వాసలు ఒత్తిడిని దూరం చేస్తాయి. శ్వాసకు సంబందించిన ఎక్సర్సైజులతో బీపీ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లాపింగ్ ఎక్సర్సైజులు కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. నవ్వడం మొదలు పెడితే అది అందరికీ విస్తరించి నిజంగానే నవ్వు వస్తుంది. పెంపుడు జంతువులు ఒత్తిడిని దూరం చేస్తాయి. ముఖ్యంగా కుక్కలతో సమయం గడిపితే ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ సయమం పాటు స్క్రీన్ ముందు గడపడం కూడా స్ట్రెస్ కు కారణం అవుతుంది. వీటిని పరిమితంగా వాడడం అలవాటు చేసుకోవాలి. తోటపనితో కూడా స్ట్రెస్ దూరం అవుతుంది. మొక్కలు పెంచుకోవడం వాటి సంరక్షణ జీవితం మీద ఆసక్తి పెంచుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే