బొప్పాయి ఆకులు చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ టైప్ వారికి ఎంతో మేలు చేస్తాయి.

మొటిమల మీద బొప్పాయి ఆకుల రసం పూసి కాసేపు ఉంచుకుని కడిగేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే చాలు.

బొప్పాయి ఆకులు చర్మం మీద ఏర్పడిన గాయలు, మొటిమల మరకలను తొలగిస్తాయట. మాయిశ్చరయిజర్ గా కూడా పనిచేస్తాయి.

పొడి చర్మం కలిగిన వారు బొప్పాయి ఆకులతో చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. చర్మాన్ని క్లియర్ గా ఉంచుకోవచ్చు.

బొప్పాయి ఆకులు యూవీ కిరణాల నష్టం నుంచి కూడా చర్మాన్ని కాపాడుతాయి. సన్ బర్న్ వల్ల చర్మం నల్లబడకుండా నివారిస్తాయి.

బొప్పాయి పండు, ఆకుల్లోనూ విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

బొప్పాయి ఆకులను పేస్ట్‌లా చేసి చర్మం మీద రాసుకుని రాత్రంతా ఉంచుకుని తెల్లవారి కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే