చల్లని లేదా వేడి పదార్థాలు దంతాలకు తాకగానే జివ్వుమనే ఒక బాధ కలుగుతుంది. దీనినే సెన్సిటివిటి అంటారు.

పోటాషియం నైట్రేట్ లేదా స్ట్రోనిటమ్ క్లోరైడ్ కలిగిన టూత్ పేస్టులను ఎంచుకుంటే మంచిది.

హార్ట్ బ్రిసిల్స్ కలిగిన టూత్ బ్రష్ ల వల్ల సెన్సిటివి మరింత పెరగవచ్చు. కనుక మెత్తని బ్రిసిల్స్ కలిగిన టూత్ బ్రష్ లను ఎంచుకోవాలి.

పళ్లు తోముకునే సమయంలో గుండ్రగా తిప్పుతూ ఒక్కో పన్ను తోముకోవాలి. సున్నితంగా బ్రష్ చేసుకోవాలి.

రోజూ ఫ్లాజింగ్ చేసుకోవాలి. ఇది దంతాల సందుల్లోంచి కూడా ప్లేక్ ను తొలగిస్తుంది.

బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్లోరైడ్ మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల ఎనామిల్ కు నష్టం జరగదు.

వీటిని తీసుకోవడం తగ్గించాలి. లేదా తీసుకున్న ప్రతి సారీ దంతాలను నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ పుల్లింగ్ తో నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందుకోసం కొబ్బరి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే మంచిది.

అప్పుడప్పుడు ఉఫ్పునీటితో నోరు కడుకుంటే దంతాల సెన్సిటివిటి తీవ్రత తగ్గుతుంది.

Image Source: Pexels and Pixabay

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.