పొద్దుతిరుగుడు నూనె ఆరోగ్యకరమైంది. ఇందులో అన్ సాచ్యూరెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి . యాంటీఏజింగ్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలతో చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ క్రమం తప్పకుండా వాడడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేస్తే మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. శరీరంలో కణజాలాన్ని బలోపేతం చేస్తుంది. సూక్ష్మజీవుల దాడి నుంచి కాపాడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగాల నుంచి కాపాడుతుంది. ఇది కేవలం అవగాహనకోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.