హీరోయిన్లు అంటే వివిధ రంగుల డ్రెస్ల్లో.. కొత్త కొత్త డిజైన్లు తెరపైకి తీసుకొస్తారు. శృతిహాసన్ కూడా.. వివిధ రకాల మోడళ్లను ట్రై చేస్తుంది. కానీ కేవలం బ్లాక్ కలర్లోనే ప్రయత్నిస్తుంది. శృతిహాసన్‌కి బ్లాక్ అంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇన్‌స్టా పేజ్ చూస్తే చాలు.. ట్రెండీ నుంచి ట్రెడీషనల్ వరకు అన్ని డ్రెస్‌లు బ్లాక్ కలర్లో దర్శనమిస్తాయి. మేజర్ ఈవెంట్స్ నుంచి.. చిన్న చిన్న పార్టీలవరకు అన్ని ఫంక్షన్లకు బ్లాక్ డ్రెస్‌లో హాజరవుతుంది. మీకు కూడా శృతి హాసన్‌లాగా బ్లాక్ అంటే ఇష్టమా? ఇంకెందుకు ఆలస్యం మంచి డిజైన్ల కోసం మీరు కూడా ఈ భామను ఫాలో అయిపోవచ్చు. ట్రెడీషనల్ అవుట్‌ఫిట్స్‌లో కూడా బ్లాక్‌ని ఎలా మిక్స్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవచ్చు. All Images Credit : Instagram/shrutzhaasan