సమ్మర్​లో వేడి వల్ల బొద్దింకల బెడద కాస్త ఎక్కువగా ఉంటుంది. వేడివల్ల ఇవి బయటకొస్తాయి.

పైగా వాటి సంతానోత్పత్తికి సమ్మర్​లో ఉష్ణోగ్రతలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వీటి బెడద ఎక్కువగా ఉంటుందట.

ఈ సమయంలో బొద్దింకలను ఇంట్లోనుంచి బయటకు పంపడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

బేకింగ్ సోడా బొద్దింకలను ఇంట్లోనుంచి బయటకు పంపడంలో బాగా హెల్ప్ చేస్తుందట.

బేకింగ్ సోడాలో షుగర్ కలిపి పెడితే బెద్దింకల బెడద తగ్గిపోతుందట.

బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో దీనిని చల్లితే వాటి బెడద వదిలిపోతుందట.

తక్కువ సమయంలోనే ఇవి ఇంటి నుంచి వెళ్లిపోతాయని చెప్తున్నారు.

గోరు వెచ్చని నీటిలో వెనిగర్ కలిపి బొద్దింకల బెడద ఎక్కువ ఉండే ప్రదేశంలో చల్లినా మంచి ఫలితాలుంటాయట.

కెమికల్స్ ఉపయోగించినా పర్లేదు అనుకుంటే బొద్దింకలను చంపేందుకు ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

ఈ టిప్స్​తో సమ్మర్​లో బొద్దింకల బెడదను ఈజీగా తగ్గించుకోవచ్చు.